డాక్టర్లకు నిద్రలేమి సమస్య ఎక్కువైంది

డాక్టర్లకు నిద్రలేమి సమస్య ఎక్కువైంది
  • రోనా పేషంట్లకు ట్రీట్‌మెంట్‌ ఇచ్చిన డాక్టర్లపై సర్వే

బీజింగ్‌: కరోనా పేషంట్ల కోసం పని చేసిన డాక్టర్లు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారని ఒక స్టడీ ద్వారా వెల్లడైంది. ఈ మహమ్మారి కేవలం ఫిజికల్‌ హెల్త్‌ కాకుండా.. మెంటల్‌ హెల్త్‌పైన కూడా ప్రభావం చూపుతుందని అన్నారు. ఫ్రాంటియర్స్‌ ఇన్‌ సైక్యార్టిస్ట్‌ వారు చేసిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. హాస్పిటల్‌లో ఎక్కువ షిఫ్ట్స్‌ చేయడం వల్ల వాళ్లలో డిప్రెషన్‌, స్ట్రెస్‌ పెరిగిందని, దాని వల్ల నిద్రలేమి సమస్య వచ్చిందని అన్నారు. చైనాకు చెందిన 1563 డాక్టర్లను వీ చాట్‌ ద్వారా స్టడీ చేసి ఈ రిపోర్ట్‌ ఇచ్చినట్లు చైనాలోని సదరన్‌ మెడికల్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌‌ బిన్‌ ఝాంగ్‌ చెప్పారు. వారిలో 36.1 శాతం మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారని తెలిసిందని అన్నారు. కరోనా తగ్గుముఖం పట్టకుండా అలానే కంటిన్యూ అయి ఉంటే.. డాక్టర్లలో ఆ సమస్య ఇంకా తీవ్రమయ్యేదని ఆయన అభిప్రాయపడ్డారు. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 9 మధ్య సర్వే చేశామని అన్నారు. మెడికల్‌ స్టాఫ్‌ దాదాపు 12 గంటల పాటు పీపీఈ సూట్లు వేసుకుని ఉండేవారని, దాన్ని తీస్తే ఇన్‌ఫెక్షన్‌ వస్తుందేమో అనే భయంతో తీసేవారు కాదని స్టడీలో తేలింది. “ ఇలాంటి డేంజరస్‌ కండీషన్స్‌లో మెడికల్‌ స్టాఫ్‌ మెంటల్‌గా, ఫిజికల్‌గా డిస్ట్రబ్‌ అయ్యారు. దాని వల్ల కూడా వారిలో స్ట్రెస్‌ పెరిగి.. నిద్ర లేమి సమస్యతో బాధపడుతున్నారు” అని ఝాంగ్‌ చెప్పారు.