గుడ్డు తినడం ఆరోగ్యానికి మంచిదా? కాదా?

గుడ్డు తినడం ఆరోగ్యానికి మంచిదా? కాదా?

గుడ్డు మాత్రమే తినాలా? లోపలి పసుపు గుడ్డు తినకూడదా? ఈ ప్రశ్నలకు కొంత మంది మంచిదని అంటే మరికొందరు గుడ్డు తింటే కొలెస్ట్రాల్ పెరిగి గుండె పోటు లాంటి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తారు. కానీ ఏది నిజం? అన్న అనుమానం మాత్రం ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. అయితే వైద్య శాస్త్రం ఏం చెబుతోందన్నది చూస్తే.. గుడ్డు ఆరోగ్యానికి మంచిదని స్పష్టమవుతోంది.

అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సూచనలు

  • ఇటీవలే అమెరికా హార్ట్ అసోసియేషన్ గుడ్డు విషయంలో కొన్ని సలహాలు, సూచనలను ప్రకటించింది.
  • వాస్తవానికి గుడ్డు హైకొలెస్ట్రాట్ ఫుడ్. కానీ ఇది ఆరోగ్యానికి చెడు చేయదు. గుండె జబ్బులు రాకుండా చేసే హెడీఎల్ లెవల్‌ను పెంచుతాయి గుడ్డులో ఉండే కొవ్వులు.
  • రోజూ రెండు గుడ్లు వరకూ తింటే ఆరోగ్యానికి ఏ ప్రమాదం లేదని తెలిపింది ఆ సంస్థ. ఫుల్‌గా గుడ్డు మొత్తం తినేయొచ్చు. లోపలి పచ్చ సొన కూడా తీయక్కర్లేదు.
  • ఆ పరిమితిలో తింటే గుడ్డులో ఉండే కొవ్వుల వల్ల గుండె ఆరోగ్యానికి ఏ ముప్పు ఉండదు.
  • శరీరానికి మంచి ప్రొటీన్, విటమిన్లు, మినరల్స్ అంది రోగనిరోధక శక్తి పెరుగుతుందని తెలిపింది అమెరికా హార్ట్ అసోసియేషన్. మంచి ప్రొటీన్ కోసం శాకాహారులు కూడా గుడ్డు తినడం మంచిదని సూచించింది.
  • నూనెల్లో వేయించిన గుడ్లు కాకుండా ఉడకబెట్టిన గుడ్లను నేరుగా తింటే ఆరోగ్యానికి మంచిదని తెలిపింది.
  • రోజూ రెండు గుడ్లు చొప్పున 6 వారాలు తింటే హెచ్‌డీఎల్ లెవల్ 10 శాతం పెరుగుతుంది. దీని వల్ల గుండె, మెదడుకు కూడా మంచిది. హార్ట్, బ్రెయిన్ స్ట్రోక్ రాదు.

గుడ్డు చేసే మేలు

  • కణాల తయారీలో మెయిన్: శరీరానికి కొవ్వుల అవసరం ఉంది. కణాలు తయారీలో కొలెస్ట్రాల్ పాత్ర కీలకం. సరిపడా కొవ్వులు లేకపోతే సెల్స్ బలహీనంగా తయారవుతాయి. గుడ్డు తినడం ద్వారా మంచి కొలెస్ట్రాల్ అందుతుంది.
  • కేన్సర్ కంట్రోల్: శరీరానికి సరిపడా కొవ్వులు అందితే కేన్సర్‌ని కంట్రోల్ చేయొచ్చని గతంలో వెలువడిన పరిశోధనలు తెలిపాయి.
  • సూపర్ ఫుడ్: విటమిన్స్, మినరల్స్, న్యూట్రియంట్స్, యాంటాక్సిడెంట్స్‌తో కూడిన సూపర్ ఫుడ్ గుడ్డు.
  • బరువు తగ్గడానికి, కండరాల బలం పెరగడానికి, కంటి ఆరోగ్యానికి ఇలా అన్ని రకాలుగా గుడ్డు తినడం మంచిదని వైద్యులు చెబుతున్నారు.

More News…

హాస్యనటుడు అలీకి మాతృ వియోగం
నన్ను ఉరి తీయొద్దు: నిర్భయ దోషి పవన్ పిటిషన్‌పై కోర్టులో హైడ్రామా
ఎలాగో చస్తాం.. మళ్లీ ఉరి శిక్షెందుకు: సుప్రీంలో నిర్భయ దోషి వింత పిటిషన్
నిర్భయ దోషుల్ని త్వరగా ఉరి తీయండి: సుప్రీంలో పిల్

గుడ్డు తినడం ఆరోగ్యానికి మంచిదా? కాదా?