తెల్లాపూర్​లో హడలెత్తించిన కుక్క .. ఒకే రోజు18 మందిపై దాడి

తెల్లాపూర్​లో హడలెత్తించిన కుక్క .. ఒకే రోజు18 మందిపై దాడి

రామచంద్రాపురం,వెలుగు: కనిపించిన వారిపై దాడిచేస్తూ ఓ కుక్క గ్రామస్తులను హడలెత్తించింది. ఎదురొచ్చిన చిన్నారులపై దాడి చేసి గాయపరచడంతో స్థానికులు భయ బ్రాంతులకు గురయ్యారు. ఈఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం తెల్లాపూర్​మున్సిపల్​పరిధిలో సోమవారం జరిగింది. తెల్లాపూర్​లో ఒకే రోజు18 మందిపై కుక్క దాడి చేయడంతో స్థానికులంతా ఒక్క సారిగా భయానికి గురయ్యారు. 

ఎలాగైనా కుక్కను పట్టుకోవాలని ప్రయత్నించినా కుక్క దొరకలేదు. దీంతో మున్సిపల్​ సిబ్బందికి సమాచారమందించించారు. వారు కుక్కను పట్టుకునేందుకు ప్రయత్నించిన దొరకలేదు. కుక్క దాడిలో గాయపడినవారికి స్థానిక ఆస్పత్రిలో చికిత్సనందించారు. గాయపరుస్తున్న  కుక్కను త్వరగా పట్టుకోవాలని మున్సిపల్​ సిబ్బందిని స్థానికులు కోరారు.