హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్‌ఎంసీ చేపట్టిన 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా కుక్కల నివారణ, కుక్క కాట్లపై అవగాహన కార్యక్రమాలను వెటర్నరీ అధికారులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పాఠశాలల్లోని విద్యార్థులకు కుక్క కాటు నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. వీధి కుక్కలతో ఎలా ప్రవర్తించాలి, అవి కోపంగా ఉన్నప్పుడు ఎలా దూరంగా ఉండాలనే దాంతో పాటు ఒకవేళ కుక్క కరిస్తే వెంటనే ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపై అవైర్ నెస్ కల్పిస్తున్నారు. కుక్క కాటు తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు.
