పాముతో ఫైట్ చేసి.. యజమానిని కాపాడిన కుక్క

పాముతో ఫైట్ చేసి.. యజమానిని కాపాడిన కుక్క

కుక్కకు ఉన్న విశ్వాసం చాలా గొప్పదని ఊరికే అనలేదు. తనను పెంచుకుంటున్న యజమాని పట్ల విశ్వాసాన్ని చూపించి.. తన ప్రాణాలనే విడిచింది ఓ కుక్క. ఖమ్మం జిల్లా కల్లూరులోని గోపాలకుంటకు చెందిన ఆర్ఎంపీ డాక్టర్ కిషోర్ ఒక కుక్కను ఎప్పటినుంచో పెంచుకుంటున్నాడు. అది వారి కుటుంబంలోని ఒక వ్యక్తిలాగా మారిపోయింది. అదంటే ఆ ఇంట్లో వాళ్లకి చెప్పలేనంత ప్రేమ. దాన్ని కిషోర్ కుటుంబ సభ్యులు ఒక కుక్కలా కాకుండా.. తమతో పాటు సమానంగా చూసుకునేవారు.

అలాంటి కుక్క పాము కాటుకు బలైపోవడంతో కిషోర్, అతని భార్య కన్నీటిపర్యంతమవుతున్నారు. శనివారం కిషోర్ ఇంట్లో నిద్రిస్తుండగా.. ఎక్కడి నుంచి వచ్చిందో కాని ఒక తాచుపాము కిషోర్ మంచం కిందికి వచ్చింది. అది చూసిన పెంపుడు కుక్క పామును అడ్డుకుంటూ అరవడం మొదలుపెట్టింది. పాము కిషోర్ ను కాటేసేందుకు ప్రయత్నించి.. కుక్క అడ్డురావడంతో దానిని కాటేసింది. ఆ అరుపులకు కిషోర్ నిద్రలేచి చూడగా.. కుక్క పాముతో పోట్లాడటం కనిపించింది. ఆ తర్వాత కుక్క పామును నోటకరచుకొని ఇంటి బయటకు లాక్కెళ్లింది. బయటకు వచ్చిన కిషోర్ వెంటనే పామును కొట్టి చంపాడు. కిషోర్ కుక్కను ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో తన ప్రాణాలను విడిచింది. ప్రతిరోజూ ఉదయాన్నే తమను నిద్రలేపే కుక్క చనిపోవడంతో కిషోర్, అతని భార్య తలచుకొని తలచుకొని ఏడుస్తున్నారు.

For More News..

అలుగు- గబ్బిలం కలయికే కరోనా

కరోనాతో బంపర్ ఆఫర్.. రూ. 300 కే పండ్లబుట్ట

క్యూలో ప్రాణాలు.. 15 గంటలైనా హాస్పిటల్‌‌ బయటే పేషెంట్లు

భారత్ లో 9వేలు దాటిన కేసులు