చిన్నపిల్లలపై కుక్కల దాడి..ఏడుగురికి గాయాలు

చిన్నపిల్లలపై కుక్కల దాడి..ఏడుగురికి గాయాలు

రాష్ట్రంలో రోజు రోజుకు కుక్కలు రెచ్చిపోతున్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా కండలు పీకేస్తున్నాయి. దీంతో చిన్నపిల్లలు బయటకు రావాలంటే జంకుతున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపల్ పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి.  ఏడుగురు చిన్నారులపై దాడి చేశాయి. వీధుల్లో ఆడుకుంటున్న  చిన్నారులపై కుక్కలు తీవ్రంగా దాడి చేశాయి. దీంతో పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఇద్దరు చిన్నారులను చికిత్స కోసం హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. 

కుక్కల దాడుల వల్ల వీధుల్లో చిన్నారులు ఒంటరిగా తిరగాలంటే జంకుతున్నారని స్థానికులు చెబుతున్నారు. వెంటనే కుక్కల నియంత్రణ చర్యలు చేపట్టాలని స్థానిక అధికారులను కోరారు.