జనవరిలో విమాన ప్రయాణికులు 1.31 కోట్ల మంది

జనవరిలో విమాన ప్రయాణికులు 1.31 కోట్ల మంది

న్యూఢిల్లీ: డొమెస్టిక్ ఎయిర్‌‌‌‌లైన్ కంపెనీలు కిందటి నెలలో 1.31 కోట్ల ప్యాసింజర్లను తమ గమ్యస్థానాలకు చేరవేశాయి.  కిందటేడాది జనవరిలో ఈ నెంబర్ 1.25 కోట్లుగా రికార్డయ్యింది. 60.2 శాతం మార్కెట్ వాటాతో ఇండిగో  లీడర్‌‌‌‌గా కొనసాగుతోంది. ఎయిర్‌‌‌‌ ఇండియా 12.2 శాతం వాటాతో రెండో ప్లేస్‌‌లో నిలిచింది. డీజీసీఏ డేటా ప్రకారం,  ప్యాసింజర్ లోడ్ ఫాక్టర్‌‌‌‌ (పీఎల్‌‌ఎఫ్– సీట్లు ఎక్కువగా నిండిన) ఎక్కువగా రికార్డ్‌‌ చేసిన కంపెనీల్లో   విస్తారా, స్పైస్‌‌జెట్‌‌ ముందున్నాయి. క్యాన్సిలేషన్ రేట్‌‌ (టికెట్లు క్యాన్సిల్ చేసుకోవడం) కిందటి నెలలో 3.67 శాతంగా రికార్డయ్యింది. రీజినల్‌‌ ఎయిర్‌‌‌‌లైన్ కంపెనీ ఫ్లైబిగ్‌‌ ఎక్కువ క్యాన్సిల్‌‌ రేట్ (11.76 శాతం) నమోదు చేసింది. ఆ తర్వాత ఇండిగో, స్పైస్‌‌జెట్‌‌, ఎయిర్‌‌‌‌ఇండియా ఉన్నాయి. వాతావరణం బాగోలేకపోవడంతో ఎక్కువగా టికెట్లు క్యాన్సిల్ అయ్యాయి.