గృహ హింస : పాలు విరిగిపోయాయని భార్య ప్రాణం పోయేల కొట్టిన భర్త

గృహ హింస : పాలు విరిగిపోయాయని భార్య ప్రాణం పోయేల కొట్టిన భర్త

మహిళలకు అత్తింటి వారి నుంచి చిత్రహింసలకు గురికాకుండా చూసేందుకు ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చిన ఫలితం లేకుండా పోతుంది. గృహ హింస లాంటివి ఎన్ని తెచ్చిన రోజుకో చోట మహిళ తన అత్తింటి వారి నుంచి చిత్రహింసలకు గురవుతూనే ఉంది. మే 30 2024 నాడు హైదరాబాద్ లోని మధురానగర్ ఎల్లారెడ్డి గూడలో దారుణం జరిగింది. అక్మల్ హుస్సేన్ అతని భార్య హీనా బేగం కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు.

   అదనపు కట్నం కోసం భార్య హీనా బేగంని అత్తింటి వారు రోజూ చిత్ర హింసలకు గురిచేశారు. ఇవాళ పొయి మీద పాలు విరిగాయని ఓ భర్త తన భార్యను ప్రాణం పోయేలా కొట్టాడని భార్య ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్తతో పాటు అత్తింటి వారి నుంచి రోజూ చిత్రహింసలు అనుభవిస్తున్నాని చెబుతుంది భార్య. మూడురోజుల పాటు గదిలో బంధించి పైశాచికంగా దాడి చేశాడని తెలిపింది. 

మీ కుమార్తె చనిపోయింది అంటూ తల్లి దండ్రులకు ఫోన్ చేశాడని ఒళ్ళంతా గాయాలతో కమిలిపోయి ఉన్న కుమార్తెను చూసి కుటుంబ సభ్యులు ఆవేదనకు గురై ఆస్పత్రిలో చేర్చారు. బేగం చిత్ర హింసలు తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.