తెలంగాణలో ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. ఎండ తీవ్రతకు జనం అల్లాడిపోతున్నారు. 43 డిగ్రీల సెల్సియస్‌కు పెరిగే అవకాశం ఉన్నందున హైదరాబాద్‌తో పాటుగా మివచ్చే రెండురోజులు(శని, ఆది) రోజులు వడగాలులు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో మధ్యాహ్నం 12.00 నుండి మధ్యాహ్నం 03.00 గంటల మధ్య అవసరం ఉంటే తప్ప బయటకు రాకపోవడం ఉత్తమమని తెలిపింది.
తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల్ జిల్లాల్లోని శనివారం తీవ్రమైన వేడిగాలులు ఉండే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. ఆదివారం తర్వాత ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలిపింది. అలాగే, ఆదివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.