అమెరికా మాజీ అధ్యక్షులు ట్రంప్ సోషల్ మీడియాలో ఒకటైన ట్విట్టర్‌లో రీ ఎంట్రీ ఇచ్చారు. కానీ.. కాసేపటికే షాక్ తగిలింది. ట్విట్టర్ ఆయన్ను నిషేధించినా తన మద్దతుదారులకు తన వాయిస్ ను అందించడానికి కొత్త సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎంచుకున్నారు. తన పోస్టులన్నింటినీ ట్విట్టర్ లో @PressTrumpTS పేరిట పోస్టులు చేయడం ప్రారంభించారు. తనను ఎవరూ ఏమి చేయలేరని స్వేచ్చగా పోస్టులు చేస్తున్నా..ఇది ఎక్కువ కాలం నిలవలేదు. మైక్రో బ్లాగింగ్ వెబ్ సైట్ నుంచి ఖాతాను నిషేధించారు. ఖాతా నిషేధించబడానికి ముందు దాదాపు 210 ట్వీట్లు ఉన్నాయని Huffpost వెల్లడంచింది.
ఏప్రిల్ నుంచి ఖాతా చురుకుగా ఉందని తెలిపింది. ట్రంప్ సోషల్ ట్రూత్ నుంచి కాపీ పేస్ట్ చేసినవేనని ట్విటర్ పేర్కొంది. 2021, జనవరి 06వ తేదీన యూఎస్ కేపిటల్ పై అతని మద్దతుదారులు దాడి చేసిన తర్వాత అతనిపై నిషేధం విధించారు. ట్రంప్ చేసిన ట్వీట్లు హింసను ప్రేరేపించాయని ట్విట్టర్ పేర్కొంది. ఏప్రిల్ నుంచి ఆ అకౌంట్ యాక్టివ్ గా ఉందని వెల్లడించింది. వ్యక్తులు, ఖాతాలు, సస్పెన్షన్ ను అధిగమించడానికి ప్రయత్నిస్తే.. ఆ ఖాతాను పూర్తిగా నిషేధించే పాలసీని ట్విట్టర్ కలిగి ఉందనే సంగతి తెలిసిందే. ట్విట్టర్ ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేస్తారని తెగ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో ట్రంప్ రీ ఎంట్రీపై తెగ చర్చ జరిగింది.
మరిన్ని వార్తల కోసం : -
అమెరికాలో మంకీపాక్స్ ఫస్ట్ కేసు..వ్యాధి లక్షణాలివే
పెట్రోల్ కొనేందుకు డబ్బులు లేవు
