అమెరికాలో మంకీపాక్స్ ఫస్ట్ కేసు..వ్యాధి లక్షణాలివే

అమెరికాలో మంకీపాక్స్ ఫస్ట్ కేసు..వ్యాధి లక్షణాలివే

కరోనా కల్లోలం నేపథ్యంలో ప్రజలను కొత్త వైరస్ ల భయం వెంటాడుతోంది. తాజాగా మంకీ పాక్స్ వైరస్ పలు దేశాల్లో బయటపడడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే కెనడాలో 10కి పైగా మంకీ పాక్స్ కేసులు నమోదయ్యాయి. తాజాగా అమెరికాలో కూడా మంకీ పాక్స్ కేసు నమోదయ్యింది. కెనడా నుండి వచ్చిన వ్యక్తికి ఈ వైరస్ సోకినట్లు యూఎస్ ప్రకటించింది. కెనడా క్యూబెక్ ప్రావిన్సుల్లో 12కిపైగా అనుమానస్పద మంకీపాక్స్ కేసులను గుర్తించి చికిత్స అందజేస్తున్నారు.

ఈ వారం ప్రారంభంలో ఐరోపాలో భారీగా మంకీపాక్స్ కేసులను గుర్తించారు అధికారులు. మంకీపాక్స్‌ను సీరియ‌స్ వైర‌స్ కేసుగా భావిస్తున్నారు. ఫ్లూ లాంటి ల‌క్ష‌ణాల‌తో అస్వ‌స్థ‌త ప్రారంభం అవుతుంది. జ్వ‌రం, వ‌ళ్లు నొప్పులు, శ‌రీరంపై పుండ్లు వ్యాపిస్తాయి. మరోవైపు కెనడాలోని మాంట్రియల్ నగరంలో 13 మంకీపాక్స్ కేసులను గుర్తించిన అధికారులు చికిత్స అందజేస్తున్నారు. ఈ వైరస్ సోకిన వ్యక్తికి వచ్చిన పుండ్ల వల్ల, లైంగిక చర్యల వల్ల ఇతరులకు ఇది వ్యాధి వ్యాప్తి చెందుతుందని మసాచుసెట్స్ ఆరోగ్య అధికారులు చెప్పారు. వ్యాధి బారినపడ్డ వారి ఉపయోగించిన వస్తువులను వాడినా వైరస్ సోకే ప్రమాదం ఉందని వెల్లడించారు. దీనికి చికెన్ పాక్స్ లక్షణాలే ఉంటాయని తెలిపారు.

గత రెండు వారాలుగా ఐరోపాలోని పోర్చుగల్,స్పెయిన్,బ్రిటన్ లలో అసాధారణంగా బయటపడ్డ డజన్లకొద్దీ మంకీపాక్స్ కేసులకు అసహజ లైంగిక కార్యకలాపాలే కారణమని సీడీసీ పోక్స్ వైరస్ నిపుణుడు డాక్టర్ ఇంజెర్ డామన్ తెలిపారు. లైంగిత ధోరణితో సంబంధం లేకుండా ఎవరికైనా మంకీపాక్స్ వ్యాధి వ్యాప్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇక ఇప్పటివరకు 40 మంకీపాక్స్ కేసులు నమోదైనట్లు స్పెయిన్,పోర్చుగల్ ప్రకటించాయి.

 

మరిన్ని వార్తల కోసం

నార్త్ కొరియాలో కరోనా కల్లోలం..ఆందోళనలో కిమ్ సర్కార్

మహేశ్ బాబును పాన్ మసాలా భరిస్తుందా ?