నార్త్ కొరియాలో కరోనా కల్లోలం..ఆందోళనలో కిమ్ సర్కార్

నార్త్ కొరియాలో కరోనా కల్లోలం..ఆందోళనలో కిమ్ సర్కార్

ఉత్తర కొరియాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఆ దేశ వాసులు మిస్టరీ జ్వరం బారినపడుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తుంది కిమ్ ప్రభుత్వం. నార్త్ కొరియా ఉద్ధృతితో కొత్త వేరియంట్లు పుట్టుకువచ్చే అవకాశం ఉందని భయపడతుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. నార్త్ కొరియాలో బుధవారం 2 లక్షల 32 వేల మందికి పైగా కరోనా బారినపడ్డారు. ఆరుగురు చనిపోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1.7 మిలియన్లకు చేరగా మరణాలు 62కు పెరిగాయి. 

కొద్దిసంఖ్యలోనే ఒమిక్రాన్  కేసుల్ని గుర్తిస్తున్నామని ఉత్తర కొరియా అధికారులు చెప్తుండగా ఈ జ్వరం కేసులన్నీ కొవిడ్ కావొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అధికారుల ఇమ్మెచ్యూరిటీ, ఆలస్యంగా స్పందించడమే వైరస్ వ్యాప్తికి కారణమని అధ్యక్షుడు కిమ్ జోంగ్  ఉన్  మండిపడ్డారు. రెట్టింపు వేగంతో పనిచేయాలని సూచించారు. ఇప్పటికే కనీస అవసరాలు తీర్చుకోలేక ఇబ్బందిపడుతోన్న ఉత్తర కొరియా ప్రజలకు కొవిడ్ ఆంక్షలు భయంకరంగా మారనున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది ఐక్యరాజ్య సమితి.

ఎటువంటి వివక్ష లేకుండా, సమయానుకూలంగా తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. అలాగే అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాలకు కట్టుబడి ఉండేలా వాటిని అమలు చేయాలని కోరింది. ఎటువంటి నియంత్రణ లేకుండా వైరస్ వ్యాప్తి చెందితే.. కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని  ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీస్  డైరెక్టర్ మైక్  ర్యాన్ ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే వ్యాక్సిన్లు వేయని, అరకొర వైద్య సేవలు అందుబాటులో ఉన్న నార్త్ కొరియాలో కొవిడ్ పరిస్థితులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి టెడ్రోస్ హెచ్చరికలు చేశారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు మెడిసిన్, వ్యాక్సిన్, టెస్ట్ కిట్స్, టెక్నికల్ హెల్ప్ అందించేందుకు సిద్ధమని తెలిపారు.

మరిన్ని వార్తల కోసం

మహేశ్ బాబును పాన్ మసాలా భరిస్తుందా ?

రాష్ట్రంలో ఆటో,క్యాబ్స్ బంద్..టీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సెస్