రాష్ట్రంలో ఆటో,క్యాబ్స్ బంద్..టీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సెస్

రాష్ట్రంలో ఆటో,క్యాబ్స్ బంద్..టీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సెస్

రాష్ట్రవ్యాప్తంగా ఆటో, క్యాబ్స్, లారీ సేవలు నిలిచిపోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా  ఆటో, క్యాబ్స్, లారీ సంఘాల కార్మికులు ఒక రోజు సమ్మెకు దిగారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపై ఆందోళనలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జీవో 714ను వెంటనే రద్దు చేయాలి డిమాండ్ చేస్తున్నారు జేఏసీ నేతలు. జీవో 714ను రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాలని కోరుతున్నారు. వాహనాలకు ఫిట్ నెస్ రెన్యువల్ చేయకుంటే రోజుకు 50 రూపాయలు పెనాల్టీ వేస్తున్నారని దీంతో మధ్యతరగతి వాహన కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. మోటార్ వెహికిల్ యాక్ట్ 2019ని ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా పెరిగిన పెట్రోల్, డిజిల్, గ్యాస్ ధరలను తగ్గించడంతో పాటు రవాణారంగ కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు.

 

కాగా ఆటో,క్యాబ్స్ బంద్ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు టీఎస్ఆర్టీసీ వెల్లడించింది. ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని కోరింది.

 

మరిన్ని వార్తల కోసం

వాతావరణ మార్పులతో తిండికి తిప్పలు

తీర్పు ఆలస్యమైతే న్యాయం జరిగేదెలా?