భారత్ -పాక్ అణుయుద్ధాన్ని నేనే ఆపిన: డొనాల్డ్ ట్రంప్

భారత్ -పాక్ అణుయుద్ధాన్ని నేనే ఆపిన: డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ పాకిస్తాన్ మధ్య అణుయుద్ధాన్ని ఆపానన్నారు. అణుయుద్ధం జరిగి ఉంటే చాలా నష్టం జరిగేదన్నారు. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయేవారని.. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించాలని ఇరు దేశాలకు చెప్పానన్నారు.  కాల్పుల విరమణ కోసం రెండు దేశాలపై ఒత్తిడి తెచ్చానన్నారు.  యుద్ధం ఆపకపోతే  రెండు దేశాలతో వాణిజ్యపరమైన సంబంధాలుండవని హెచ్చరించినట్లు చెప్పారు ట్రంప్. భారత్,పాక్ మధ్య ఇది శాశ్వత కాల్పుల విరమణగా భావిస్తున్నానని తెలిపారు.

భారత్, పాకిస్తాన్ లతో వాణిజ్యపరమైన సంబంధాలు మరింత బలోపేతం చేస్తానన్నారు ట్రంప్. ప్రస్తుతం భారత్ తో చర్చలు జరుగతున్నాయని..పాకిస్తాన్ తో త్వరలో చర్చలు జరుపాతమన్నారు. రెండు దేశాలు తమ మాట విన్నందుకు ధన్యవాదాలు తెలిపారు ట్రంప్.

 ఇప్పటికే భారత్ పాకిస్తాన్ వివాదం మధ్య అమెరికా జోక్యం ఏంటనే వాదనలు వినిపిస్తున్నాయి.  ఈ క్రమంలోనే ఇరు దేశాలు తన వల్లే కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయని ట్రంప్ గొప్పగా చెప్పడంపై చర్చ జరుగుతోంది. మరోవైపు  ఆపరేషన్ సిందూర్ తర్వాత మొదటి సారి మాట్లాడనున్న మోదీ ట్రంప్ వ్యాఖ్యలపై ఏమైనా స్పందిస్తారా లేదా చూడాలి.