కొత్త వెబ్‌సైట్ ప్రారంభించిన ట్రంప్

కొత్త వెబ్‌సైట్ ప్రారంభించిన ట్రంప్
  • ‘45ఆఫీస్‌‌‌‌‌‌‌‌డాట్‌‌‌‌‌‌‌‌కామ్‌‌‌‌‌‌‌‌’ పేరుతో ట్రంప్‌‌‌‌‌‌‌‌ వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌
  • ఆవిష్కరించిన మెలానియా ట్రంప్‌‌‌‌‌‌‌‌

వాషింగ్టన్‌‌‌‌‌‌‌‌: సోషల్ మీడియా దిగ్గజాలు ఫేస్‌‌‌‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌‌‌, ట్విట్టర్ నుంచి శాశ్వత నిషేధాన్ని ఎదుర్కొంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌‌‌‌‌‌‌‌ కొత్త వెబ్‌‌‌‌‌‌‌‌సైట్ ప్రారంభించారు. ‘45ఆఫీస్‌‌‌‌‌‌‌‌డాట్‌‌‌‌‌‌‌‌కామ్‌‌‌‌‌‌‌‌’ పేరుతో నడిచే ఈ వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌ను ఆయన భార్య మెలానియా ట్రంప్‌‌‌‌‌‌‌‌ సోమవారం ఆవిష్కరించారు. ‘అమెరికా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేందుకే ఈ వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌ స్టార్ట్‌‌‌‌‌‌‌‌ చేశారు. దేశ ప్రజల స్ఫూర్తితో తమ జంట బలపడుతోంది. ట్రంప్ మద్దతుదారులు ఈవెంట్స్‌‌‌‌‌‌‌‌లో పాల్గొనడానికి, లేఖలు ఇవ్వడానికి, పర్సనల్‌‌‌‌‌‌‌‌గా విషెస్ చెప్పడానికి ఈ వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌ ఉపయోగపడుతుంది’ అని ట్రంప్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌  ఓ స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో పేర్కొంది. వైట్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌లో ఉన్నప్పుడు ట్రంప్ చేపట్టిన కార్యక్రమాల వివరాలను కూడా వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌లోని ఒక పేజీలో పొందుపరిచారు. ఫ్లోరిడాలో ఈ ఏడాది ప్రారంభంలో ట్రంప్‌‌‌‌‌‌‌‌ తన అధికారిక పోస్ట్‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెన్సీ ఆఫీసును స్టార్ట్ చేశారు.