
ట్రంప్ మాటమార్చాడు..భారత్, పాక్ మధ్య యుద్ధాన్ని ఆపాను అని గతంలో చేసిన వ్యాఖ్యలపై యూటర్న్ తీసుకున్నారు. భారత్, పాక్ యుద్దం నేను ఆపలేదు..అమెరికాది పరోక్ష పాత్ర మాత్రమే. రెండు దేశాల మధ్య ప్రత్యక్ష సైనిక చర్చల వల్లే కాల్పుల విరమణ ఏర్పడిందన్నారు. ఖతార్‌లోని దోహాలో జరిగిన వాణిజ్య సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ తన వ్యాఖ్యలపై రెండు రోజులకే మాట మార్చడం ఆశ్చర్యాన్ని కలిగించింది.
గురువారం (మే15) ఖతార్ లోని అల్ ఉదీద్ వైమానిక స్థావరంలో ఆర్మీని ఉద్దేశించి ట్రంప్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.‘‘నేను భారత్ , పాక్ మధ్య యుద్ధాన్ని ఆపాను అని చెప్పుకోవడం లేదు గానీ.. ఖచ్చితంగా ఆ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించాను’’ అన్నారు. క్షిపణులతో భీకరంగా దాడులు చేసుకున్నారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో పరోక్ష పాత్ర పోషించాను. ప్రస్తుతం ప్రశాంతత నెలకొంది. రెండు దేశాలు వాణిజ్యంపై దృష్టిపెట్టాలని చెప్పాను. ఇప్పుడు పాకిస్తాన్, ఇండియా చాలా సంతోషంగా ఉన్నాయి ’’ అని ట్రంప్ చెప్పారు.
భారత్, పాక్ కాల్పులవిమరణకు ముందు ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘భారత్, పాక్ మధ్య యుద్దాన్ని నేను ఆపాను.. రెండు దేశాలు నా మాట విని యుద్దాన్ని ఆపాయి.. పహల్గాం అటాక్ తర్వాత భారత్ , పాక్ మధ్య అణుబాంబులతో యుద్దం చేసే స్థాయిలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి.. నా మధ్యవర్తిత్వంతో అణు విధ్వంసాన్ని ఆపాను’’ అని ప్రకటించారు.
దోహాలో ట్రంప్ వ్యాఖ్యలు ఆయన మాట మార్చినట్లు.. భారత్,పాక్ మద్య మధ్యవర్తిత్వంపై అస్పష్టమైన వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. రెండు దేశాల మధ్య చాలా కాలంగా కొనసాగుతున్న శత్రుత్వాలను ప్రస్తావించారు ట్రంప్. భారత్, పాకిస్తాన్ దాదాపు వెయ్యేళ్లుగా న్యాయంగా పోరాడుతున్నారు. వారి సమస్య పరిస్కారం అయింది.. అయితే ఖచ్చితంగా నేను పరిష్కరించాను అని చెప్పడం లేదు.. పరోక్షంగా పరిష్కరించాను’’ అన్నారు. ఈ వ్యాఖ్యలు ట్రంప్ మునుపటి స్వరం నుంచి మార్పును సూచించాయి. భారత్, పాకి వివాదం చారిత్రక మూలు, అస్థిరతను హైలైట్ చేస్తూ ఉద్రిక్తతలను తగ్గించడంలో అమెరికా పాత్రపై అస్పష్టమైన వివరణను ట్రంప్ మాటలు స్పష్టం చేస్తున్నాయి.