మార్వాడీలను కొత్త షాపులు పెట్టనివ్వొద్దు

మార్వాడీలను కొత్త షాపులు పెట్టనివ్వొద్దు

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మార్వాడీలను కొత్త షాపులు పెట్టనివ్వొద్దని, ప్రజలు అడ్డుకోవాలని విముక్త చిరుతల కచ్చి(వీసీకే) రాష్ట్ర అధ్యక్షుడు జిలకర శ్రీనివాస్ అన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కోరారు. ఆదివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉపాధి, ఉద్యోగం, వ్యాపారం తెలంగాణ ప్రజల హక్కు–మార్వాడి గో బ్యాక్ అనే అంశంపై మేధావులతో సమావేశం నిర్వహించారు. 

మార్వాడీ గో బ్యాక్ ఉద్యమ కన్వీనర్ పిడమర్తి రవి, రచయిత నారాయణరెడ్డి, పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి, సంగిశెట్టి శ్రీనివాస్ తో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మార్వాడీల వల్ల తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతోందని ఆరోపించారు. నకిలీ వస్తువులు అమ్ముతూ జీఎస్టీ చెల్లించని వారిపై క్రిమినల్​కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.