మోదీ మాటలు నమ్మి మోసపోకండి .. మార్పుకే ఓటెయ్యండి: ప్రియాంక గాంధీ

మోదీ మాటలు నమ్మి మోసపోకండి ..  మార్పుకే  ఓటెయ్యండి: ప్రియాంక గాంధీ

రామ్ నగర్(ఉత్తరాఖండ్): ప్రధాని మోదీ మాటలు నమ్మి మోసపోవద్దని ప్రజలకు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ సూచించారు. ఈసారి మార్పు కోసం ఓటు వేయాలని పిలుపునిచ్చారు. శనివారం ఉత్తరాఖండ్ లోని రామ్ నగర్ లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రియాంక పాల్గొని మాట్లాడారు. ‘‘ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ చెప్పే మాటలు విని మోసపోకండి. ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. గత పదేండ్లలో ఏం అభివృద్ధి జరిగిందో మీకు మీరే ప్రశ్నించుకోండి. నిజంగా మోదీ ప్రభుత్వం.. మీ బతుకుల్లో వెలుగులు నింపిందా? ఆలోచించండి” అని ప్రజలను ఆమె కోరారు. మోదీ పాలనలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరిగిపోయిందని, పరీక్ష పేపర్లు లీక్ అవుతున్నాయని విమర్శించారు.