రూమర్స్ నమ్మొద్దు: బ్యాంకింగ్ వ్యవస్థపై ఆర్బీఐ ప్రకటన

రూమర్స్ నమ్మొద్దు: బ్యాంకింగ్ వ్యవస్థపై ఆర్బీఐ ప్రకటన

ముంబై: బ్యాంకుల గురించి హల్ చల్ చేస్తున్న రూమర్స్ నమ్మొద్దని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటన విడుదల చేసింది. కొన్ని ప్రాంతాల్లో కోఆపరేటివ్, ప్రభుత్వ రంగ బ్యాంకులను మూసేయాలని ఆర్బీఐ నిర్ణయించిందంటూ పుకార్లు ప్రచారం జరుగుతున్నాయి.

ఆ రూమర్స్ నమ్మొద్దని, ప్రజలు, ఖాతాదారులు భయపడొద్దని ఆర్బీఐ ఈ రోజు కోరింది. బ్యాంకింగ్ వ్యవస్థ పటిష్టంగా ఉందని స్పష్టం చేసింది. ప్రజలు ఎటువంటి అపోహలకు గురికావొద్దని సూచించింది. మన దేశ బ్యాంకు వ్యవస్థ సుస్థిరంగా, భద్రంగా ఉందని వెల్లడించింది ఆర్బీఐ.

కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం బ్యాంకులు మూసేస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరుగగుతున్న ప్రచారాన్ని కూడా ఇటీవలే ఆర్బీఐ ఖండించింది. అలాంటిది ఏమీ లేదని స్పష్టం చేసింది. ఏ బ్యాంకునూ ఎత్తేయడం లేదని తెలిపింది. ఇంకా బ్యాంకులను పటిష్టం చేసేందుకు మూలధనం పెంచడంతో పాటు పలు సంస్కరణలు తెస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్ తెలిపారు.