నన్ను ఇబ్బంది పెట్టొద్దు.. అభిమానులకు జగపతిబాబు లెటర్

నన్ను ఇబ్బంది పెట్టొద్దు..  అభిమానులకు జగపతిబాబు లెటర్

జగపతి బాబు.. ఒకప్పుడు హీరోగా ఎన్నో సినిమాల్లో నటించారు. ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలో నటించిన హీరోగా మంచి పేరుంది. కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న జగపతి తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పాత్రాలు పోషిస్టూ విలక్షణ నటుడిగా మెప్పిస్తున్నారు. అంతేకాదు అభిమానులను ఆదుకునే విషయంలోనూ జగపతి బాబు హీరోనే. అయితే జగపతి బాబు అభిమానులపై కొంత కోపం, అసహనం, ప్రేమ వ్యక్తం చేస్తూ లెటర్ రాశాడు. 

గత 33 యేళ్లుగా  నా కుటుంబ శ్రేయోభిలాషులుగా నా అభిమానులు కూడా నా పెరుగుదలకు ముఖ్య కారణంగా భావించారు. అలాగా వాళ్ల కష్ట సుఖాల్లో తోడుగా ఉన్నాను.అభిమానులు ప్రేమ ఇచ్చే వాళ్లని పూర్తిగా నమ్మాను. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే కొంత మంది అభిమానులు ప్రేమ కంటే ఆశించటం ఎక్కువయిందని జగపతి బాధపడుతూ లెటర్ రాశాడు. 

నన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు. మనసు ఒప్పుకోకపోయినా బాధతో చెప్పాల్సిన విషయం ఏమిటంటే ఇక నుంచి నా అభిమాన సంఘాలకు , ట్రస్ట్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు.. విరమించుకుంటున్నాను. అయితే కేవలం ప్రేమించే అభిమానులకు నేనెప్పుడు తోడుగా ఉంటాను అని నటుడు జగపతి రాశాడు.