పుట్టల్లో పాలు పోయొద్దు : అటవీ అధికారులు

పుట్టల్లో పాలు పోయొద్దు : అటవీ అధికారులు

కరీంనగర్: నాగపంచమి సందర్భంగా పుట్టల్లో పోయడం సంప్రదాయం. ఐతే.. పండుగ పేరుతో పుట్టల్లో పాములకు పాలు పోయవద్దని చెబుతున్నారు అటవీ శాఖ అధికారులు. పాములు అసలు పాలు తాగవని.. వాటికి పాలు పోసినా అవి వృథాగా పోయినట్టే అని అధికారులు చెప్పారు. అవగాహన పెంచే ఉద్దేశంతో నిజమైన పాములతో ప్రదర్శనలు ఇస్తున్నారు. గ్రామాల్లో తిరుగుతూ ప్రచారం చేస్తున్నామన్నారు అధికారులు. పాములకు పూజల పేరిట పుట్టల్లో పాలు పోయవద్దంటూ అటవీ అధికారుల సూచన చేస్తున్నారు. .

కరీంనగర్ పట్టణంలో జెర్రిగొడ్డు పాముతో ప్రదర్శన ఇచ్చారు అటవీ సిబ్బంది. పాములు పాలు తాగవనీ.. అవి నిజంగా పాలు తాగితే చనిపోతాయని చెప్పారు. ఈ తరహా పాములు కీటకాలు, ఎలుకలు తిని బతుకుతాయని చెప్పారు. జెర్రిగొడ్డుకు తోకలో విషం ఉంటుందనేది కూడా నిజం కాదని చెప్పారు. పాములు తాగుతాయని, తింటాయని పుట్టల్లో పాలు, ప్రసాదాలు, గుడ్లు వేయొద్దని సూచించారు.