జగిత్యాల జిల్లాలో కొట్టుకున్న గవర్నమెంట్ టీచర్లు.. అడ్డుకోబోయిన మహిళా ఎంఈవోపైనా దాడి

జగిత్యాల జిల్లాలో కొట్టుకున్న గవర్నమెంట్ టీచర్లు.. అడ్డుకోబోయిన మహిళా ఎంఈవోపైనా దాడి
  • జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం ధోనూర్​ స్కూల్​లో ఘటన

జగిత్యాల, వెలుగు: పేరెంట్స్ మీటింగ్ లో ఇద్దరు గవర్నమెంట్​ టీచర్లు బూతులు తిట్టుకుంటూ కొట్టుకున్నారు. వారిని అడ్డుకోబోయిన మహిళా ఎంఈవోపైనా దాడి చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం ధోనూర్ జడ్పీ హైస్కూల్​లో శుక్రవారం పేరెంట్స్, టీచర్స్​ సమావేశం నిర్వహించారు. ఎంఈవో ఎస్​ సీతామహాలక్ష్మి పాల్గొన్న సమావేశంలో స్కూల్​ టీచర్​ గడిపెల్లి మహేశ్​ అదే స్కూల్ లో పని చేస్తున్న కాశెట్టి రమేశ్​పై బూతులు తిడుతూ దాడికి దిగాడు.

దీంతో రమేశ్​ సైతం మహేశ్​పై దాడికి దిగాడు. వారిని అడ్డుకునేందుకు వెళ్లిన ఎంఈవోను మహేశ్​ చేయి పట్టుకుని కొట్టాడు. ఇదిలాఉంటే మహేశ్​ వ్యవహార శైలిపై గతంలో డీఈవో కు ఫిర్యాదు చేయడాన్ని మనసులో పెట్టుకుని రమేశ్​పై దాడి చేసినట్లు చెబుతున్నారు. ఈ ఘటనపై ఎంఈవో సీతామహాలక్ష్మి ధర్మపురి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.