ఇన్​టైంలో నిమ్స్ విస్తరణ పనులు కావాలి: కలెక్టర్

ఇన్​టైంలో నిమ్స్ విస్తరణ పనులు కావాలి: కలెక్టర్

హైదరాబాద్ సిటీ, వెలుగు: నిమ్స్ హాస్పిటల్ విస్తరణ పనులను స్పీడప్​చేసి, నిర్దేశించిన గడవులోగా పూర్తిచేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన పంజాగుట్టలోని నిమ్స్ ఆవరణలో కొనసాగుతున్న పనుల పురోగతిపై సమక్షించారు. 

బ్లాక్ ల వారీగా జరుగుతున్న పనుల వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆర్ అండ్ బీ అధికారులు వివరించారు. నిమ్స్​విస్తరణ పనులపై సీఎం స్పెషల్​ఫోకస్​పెట్టారని, అవసరమైతే కూలీల సంఖ్య పెంచి పనులు పూర్తిచేయాలని కలెక్టర్ అనుదీప్​సూచించారు. ఎక్కువ మిషనరీని సమకూర్చుకోవాలన్నారు. అడిషనల్ కలెక్టర్ ముకుందరెడ్డి, సికింద్రాబాద్ ఆర్డీఓ సాయిరాం, ఆర్ అండ్ బీ  ఎస్సీ నర్సింగరావు, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప పాల్గొన్నారు.