
బ్రాడ్కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(బీఈసీఐఎల్) క్లినికల్ ఫార్మాసిస్ట్, ఐటీ ఎగ్జిక్యూటివ్, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గలఅభ్యర్థులు వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకాగలరు. వాక్ ఇంటర్వ్యూలు మే 29న నిర్వహించనున్నారు.
పోస్టులు: పేషంట్ కేర్ కో–ఆర్డినేటర్(పీసీసీ) 03, నెట్ వర్క్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ 01, క్లినికల్ ఫార్మాసిస్ట్ 01, టెలిఫోన్ ఆపరేటర్ 01, ఇన్ ఫెక్షన్ కంట్రోల్ నర్సు(ఐసీఎన్) 01, ఐటీ ఎగ్జిక్యూటివ్ 01.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత, బీసీఏ, బీఫార్మా, బీఎస్సీ, బీటెక్ లేదా బీఈలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పని అనుభవం ఉండాలి.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలకు రూ.295, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ: మే 29. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల మధ్య. చిత్తరంజన్ నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, నెట్వర్క్ క్యాంపస్, ఫస్ట్ ఫ్లోర్, హెచ్ఆర్ సెక్షన్(యాక్షన్ ఏరియా –1డి, న్యూ టౌన్, రాజర్ హట్, కోల్ కతా–700160. పూర్తి వివరాలకు www.becil.com వెబ్సైట్లో సంప్రదించగలరు.