
ఉప్పల్, వెలుగు: అప్పులు, నష్టాల పేరుతో మెట్రో టికెట్ధరలు పెంచడం దుర్మార్గమని వామపక్ష పార్టీల నాయకులు అన్నారు. ఈ మేరకు శనివారం ఉప్పల్ ఎల్ అండ్ టీ మెట్రో రైలు డిపో ముందు నిరసన చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మెట్రో చార్జీల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలపై 50% మించి భారాన్ని మోపరాదన్న నిబంధనను తుంగలో తొక్కి టికెట్ల రేట్లు పెంచారన్నారు. సిటీ ప్రజలను మెట్రోకు దూరం చేసేలా ఉన్నాయన్నారు. ప్రభుత్వాలు జోక్యం చేసుకొని పాత చార్జీలు అమలుచేయకపోతే ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.