Balagam Venu Film: మరో అద్భుతమైన కథతో దర్శకుడు బలగం వేణు.. జూన్లో ముహూర్తానికి సిద్ధం

Balagam Venu Film: మరో అద్భుతమైన కథతో దర్శకుడు బలగం వేణు.. జూన్లో ముహూర్తానికి సిద్ధం

బలగం వేణు-హీరో నితిన్ కాంబోలో ఓ సినిమా వస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు గ్రామదేవత పేరైన ‘ఎల్లమ్మ’ అని టైటిల్ ఫిక్స్ చేసుకున్నారు వేణు. అందుకు తగ్గట్టుగానే సినిమాలో ఆధ్యాత్మికం, తెలుగు నేటివిటీని కళ్ళకు కట్టినట్లు చూపించాలని వేణు ఫిక్స్ అయ్యాడట. ఎందుకంటే తెలంగాణలో మహిళలకు ఇలాంటి పేరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందరికీ చేరువయ్యేలా కథనం సిద్ధం చేస్తున్నాడట.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఎల్లమ్మ మూవీ జూన్ లో షూటింగ్ మొదలు పెట్టబోతున్నారట. సరిగ్గా ఐదు నెలల్లోపే షూటింగ్ కంప్లీట్ చేసి, డిసెంబర్ నెలలో రిలీజ్ కు తీసుకొచ్చేలా వేణు పక్కా ప్రణాళిక రూపొందించాడట. ఇప్పటికే రంగస్థల కళాకారులను కూడా ఎంపిక చేసి వారితో ప్రత్యేక రిహార్సల్స్ కూడా చేయిస్తున్నాడని సినీ వర్గాల సమాచారం. నిర్మాత దిల్ రాజు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా అన్నీ ప్రణాళికాబద్ధంగా కార్యచరణ రూపొందించుకునే సెట్ లో వేణు అడుగుపెడుతుండటం ముందుచూపుకు నిదర్శనం. 

బలగంలో ఎల్లమ్మ ఎవరు?

నితిన్ హీరోగా ‘బలగం’ఫేమ్ వేణు రూపొందించనున్న ‘ఎల్లమ్మ’చిత్రంలో కీర్తి సురేష్ నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కథను వినిపించగా, హీరోయిన్ పాత్రకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండడంతో ఆమె సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. గతంలో ‘రంగ్‌‌‌‌దే’చిత్రంతో నితిన్‌‌‌‌కు జంటగా కీర్తి సురేష్ నటించిన విషయం తెలిసిందే.

నిజానికి సాయి పల్లవి ఇందులో నటించనుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే తను ఇతర ప్రాజెక్ట్స్‌‌‌‌తో బిజీగా ఉండడంతో మరో హీరోయిన్‌‌‌‌ వేటలో పడ్డారు మేకర్స్‌‌‌‌. ఈ క్రమంలో కీర్తి సురేష్‌‌‌‌ను సంప్రదించినట్టు తెలుస్తోంది. మరి కీర్తితోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్‌‌‌‌కు వెళుతుందేమో చూడాలి!

నితిన్ సినిమాలు:

నితిన్ విషయానికి వస్తే.. వరుస సినిమాల ఫెయిల్యూర్స్ తో సతమతం అవుతున్నాడు. ఇటీవలే మాచెర్ల నియోజకవర్గం, ఎక్సట్రా, రాబిన్ హుడ్ మూవీస్ తో ఘోరపరాజయాలను చవిచూశాడు. ప్రస్తుతం వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘తమ్ముడు’మూవీ చేస్తున్నాడు. ఇది సిస్టర్ సెంటి మెంట్ నేపథ్యంలో సినిమా వస్తుండటంతో అంచనాలు నెలకొన్నాయి.

సీనియర్ హీరోయిన్ లయ కీలక పాత్రలో నటిస్తుండటం సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. కానీ, గతేడాది కాలంగా రిలీజ్ వాయిదా పడుతూ వస్తుంది. జులై 4న రిలీజ్ కానుందని మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేసిన, అప్పుడు కూడా థియేటర్స్ కు రావడం కష్టం అని అంటున్నారు. ఇక ఈ సినిమా సక్సెస్ ఇవ్వకపోతే.. నితిన్ ఆశలన్నీ బలగం వేణు వైపే! వేణు తన రెండో సినిమాకి 'ఎల్లమ్మ' టైటిల్‌గా పెట్టడం మరింత ఆసక్తికరంగా మారింది.