
నిజామాబాద్, వెలుగు : జిల్లాలో వానాకాలం పంటలకు యూరియా కొరత రాకుండా ప్రతి మండలంలో స్టాక్ పెట్టామని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి తెలిపారు. యూరియా బస్తాలు పక్క రాష్ట్రాలకు వెళ్లకుండా నిఘా పెట్టాలని ఆదేశించారు. సోమవారం రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ తరువాత ఆయా శాఖల ఆఫీసర్లతో మీటింగ్ నిర్వహించి మాట్లాడారు.
సింగిల్ విండోల్లో ఉన్న యూరియా నిల్వపై బోర్డులు పెట్టించాలని అగ్రికల్చర్ ఆఫీసర్లకు సూచించారు. రేటు పెంచి అమ్మితే చర్యలు తీసుకోవాలన్నారు. వానాకాలంతో పాటు యాసంగి సీజన్‌కు యూరియా నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
సీపీ సాయిచైతన్య, ట్రైనీ కలెక్టర్ కరోలిన్, జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ గోవిందు, కోఆపరేటివ్ ఆఫీసర్ శ్రీనివాస్, పరిశ్రమల మేనేజర్ సురేశ్‌కుమార్, మార్కెటింగ్ ఏడీ గంగుబాయి, జిల్లా ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఉమామహేశ్వర్రావు తదితరులు ఉన్నారు. తరువాత కలెక్టర్ మత్య్సశాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు
బార్డర్లో చెక్ పోస్టుల్లో తనిఖీలు చేపట్టాలి
కామారెడ్డి, వెలుగు : పక్క జిల్లాలకు యూరియా తరలకుండా చూడాలని , బార్డర్లో చెక్ పోస్టుల్లో తనిఖీలు చేపట్టాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని గ్రోమోర్ ఫెర్టిలైజర్ షాపును కలెక్టర్ తనిఖీ చేశారు. యూరియా స్టాక్‌ను పరిశీలించి మాట్లాడారు. యూరియా పంపిణీలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
సోసైటీల ద్వారా రైతులకు సరిపడా యూరియా సప్లయ్ చేయాలన్నారు. యూరియాకు ప్రత్యామ్నాయంగా నానో యూరియా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, రైతులకు అవగాహన కల్పించాలన్నారు. అంతకు ముందు రాష్ర్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఆయా జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా వ్యవసాయ అధికారి మోహన్‌రెడ్డి తదితరులు
ఉన్నారు.