ఇండియన్లను టార్గెట్చేయొద్దు.. చైనాకు భారత విదేశాంగ శాఖ సూచన

ఇండియన్లను టార్గెట్చేయొద్దు.. చైనాకు భారత విదేశాంగ శాఖ సూచన

న్యూఢిల్లీ: చైనా మీదుగా జర్నీ చేసే భారతీయులను లక్ష్యంగా చేసుకోవద్దని ఆ దేశానికి భారత విదేశాంగ శాఖ గట్టి సూచన చేసింది. అలాంటి చర్యలు రెండు దేశాల సంబంధాలను దెబ్బతీస్తాయని హెచ్చరించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి రంధీర్ జైస్వాల్ సోమవారం మీడియాతో మాట్లాడారు. అరుణాచల్ ప్రదేశ్ భారత భూభాగమే అని ఆయన పునరుద్ఘాటించారు. చైనాకు వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని భారతీయులకు అడ్వైజరీ జారీ చేసింది. ట్రాన్సిట్(ఒక విమానం నుంచి మరో విమానంలోకి మారడం) సమయంలో ఇబ్బందులు రావచ్చని హెచ్చరించింది. 

ఇటీవల అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ప్రేమా వాంగ్‌జోమ్ తోంగ్‌డాక్ అనే మహిళ జపాన్ వెళ్తుండగా షాంఘై ఎయిర్‌పోర్టులో ఆగారు. ఆమెకు భారతీయ పాస్‌పోర్ట్ ఉంది. చైనా రూల్స్​ప్రకారం వీసా లేకుండా ట్రాన్సిట్ చేయవచ్చు. అయినా ఆ దేశ అధికారులు ఆమెను నిర్బంధించి వేధించారు. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ చైనా చర్యలను ఆక్షేపించింది. అయితే చైనా మాత్రం సదరు మహిళను తాము వేధించలేదని తెలిపింది.