
సికింద్రాబాద్, వెలుగు : రైల్వే ప్రొటెక్షన్ఫోర్స్లో ఉద్యోగాలంటూ సర్క్యులేట్చేస్తున్న ప్రకటనలను నమ్మొద్దని రైల్వే అధికారులు సూచించారు. TRUEXAM.NET అనే సైట్లో రైల్వే ప్రొటెక్షన్ఫోర్స్ లో 4,208 కానిస్టేబుల్స్, 452 సబ్ -ఇన్ స్పెక్టర్ ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. రైల్వే శాఖ ఇప్పటివరకు రైల్వే ప్రొటెక్షన్ ఉద్యోగాలపై ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయలేదని తెలిపారు. నోటిఫికేషన్లను కేవలం రైల్వే శాఖ అధికారిక వెబ్సైట్లలో మాత్రమే రిలీజ్చేస్తామని చెప్పారు.