
ఏపీకి ప్రత్యేక హోదా గురించి ఇకపై ఎవరు మాట్లాడిన ప్రయోజనం ఉండదన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. హోదా ముగిసిన అధ్యయనం అని అన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని..అన్ని విధాల ఆర్థిక సాయం చేస్తుందన్నరు. దేశంలో ఐదేళ్లలో జరిగిన అభివృద్ధికి నిదర్శనం మోడీ విజయమేనన్నారు. ఈ నెల 9 న ప్రధాని మోడీ సాయంత్రం తిరుపతికి రానున్నారని.. సాయంత్రం కార్యకర్తలతో భేటీ అవుతారని..ఆ తర్వాత శ్రీవారిని దర్శించుకుని రాత్రి తిరిగి ఢిల్లీకి వెళ్తారని చెప్పారు కన్నా.