‘రాజా సాబ్’ ట్రైలర్ 2.O.. సినిమా హిట్టో.. ఫట్టో ఒక క్లారిటీ వచ్చింది !

‘రాజా సాబ్’ ట్రైలర్ 2.O.. సినిమా హిట్టో.. ఫట్టో ఒక క్లారిటీ వచ్చింది !

ఇటీవల నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌తో ‘ది రాజా సాబ్‌‌‌‌‌‌‌‌’ చిత్ర ప్రచారంలో వేగం పెంచిన మేకర్స్‌‌‌‌‌‌‌‌..  కొత్త ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఆ జోష్‌‌‌‌‌‌‌‌ను రెట్టింపు చేశారు. ప్రభాస్‌‌‌‌‌‌‌‌ హీరోగా మారుతి రూపొందిస్తున్న  ఈ చిత్రం నుంచి సోమవారం ‘రాజా సాబ్’ ట్రైలర్ 2. ఓ పేరుతో మరో ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు.  రాజాసాబ్‌‌‌‌‌‌‌‌కు నాయనమ్మ అయిన గంగమ్మ (జరీనా వాహబ్‌‌‌‌‌‌‌‌) అన్ని మర్చిపోతుంటుంది. కానీ తన భర్త (సంజయ్ దత్‌‌‌‌‌‌‌‌)ను మాత్రం మర్చిపోలేక ఇబ్బంది పడుతుంటుంది. 

మిస్టీరియస్‌‌‌‌‌‌‌‌ పర్సన్‌‌‌‌‌‌‌‌ అయిన తన తాత గురించి తెలుసుకునేందుకు మయసభ లాంటి తాత హవేలీలోకి అడుగుపెడతాడు.  అక్కడున్న వస్తువులు,  పెయింటింగ్స్‌‌‌‌‌‌‌‌, ఆర్కిటెక్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాంటివన్నీ హిప్నటైజ్ చేసేలా డిజైన్ చేసి, అందులోకి అడుగుపెట్టిన వాళ్లు ట్రాన్స్‌‌‌‌‌‌‌‌లోకి వెళ్లేలా  చేస్తాడు తాత.

అంతేకాదు దుష్ట శక్తులను ఆవాహనం చేసుకున్న తాత బంగ్లాలో అడుగడుగునా ప్రమాదాలే. అంత ప్రమాదకరమైన ఆ భవనంలోకి రాజా సాబ్‌‌‌‌‌‌‌‌ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది...  భూత ప్రేతాలు,  హిప్నాటిజం చిక్కుముడుల నుంచి ఎలా బయటపట్టాడు అనేది అసలు కథ. ఓవైపు భయపడుతున్నట్టుగా,  మరోవైపు ధీరుడిగా డిఫరెంట్ మేకోవర్స్‌‌‌‌‌‌‌‌తో ప్రభాస్‌‌‌‌‌‌‌‌ కనిపించాడు.  ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చివర్లో హాలీవుడ్ మూవీ ‘జోకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ గెటప్‌‌‌‌‌‌‌‌ను గుర్తుచేసే మేకప్‌‌‌‌‌‌‌‌తో ప్రభాస్‌‌‌‌‌‌‌‌ కనిపించాడు.

భారీ సెట్స్‌‌‌‌‌‌‌‌తో పాటు విజువల్ ఎఫెక్ట్స్‌‌‌‌‌‌‌‌తో ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆసక్తికరంగా ఉంది. ఓవరాల్గా సినిమా దాదాపు హిట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మారుతి మార్క్ కామెడీ, హారర్.. ఒక ఇంట్రస్టింగ్ స్టోరీతో ‘రాజా సాబ్’ తెరకెక్కిందని ఈ ట్రైలర్తో తేలిపోయింది. ప్రభాస్‌‌‌‌‌‌‌‌ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నటించారు.  టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానుంది.