లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన దూద్ బౌలి సబ్ రిజిస్ట్రార్

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన దూద్ బౌలి సబ్ రిజిస్ట్రార్

మంగళవారం(ఫిబ్రవరి 13) తెలంగాణలో ఇద్దరు అవినీతి ప్రభుత్వ అధికారులు ఏసీబీ వలకు చిక్కారు. ఓ భూ వివాదంలో రూ.10 లక్షలు లంచం తీసుకుంటూ శామీర్‌పేట్ తహసీల్దార్ సత్యనారాయణ పట్టుబడగా.. రిజిస్ట్రేషన్లకు సంబంధించి రూ. 2లక్షలు లంచం తీసుకుంటూ దూద్ బౌలి ఇంచార్జ్ సబ్ రిజిస్ట్రార్  అమైర్ పర్వేజ్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు. 

షాలి బండ ప్రాంతానికి చెందిన సయ్యద్ షాబాజ్ అనే వ్యక్తి నుంచి రెండు సేల్ డీడ్‌ల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి దూద్ బౌలి సబ్ రిజిస్ట్రార్ అమైర్ పర్వేజ్ రూ. 2లక్షలు లంచం డిమాండ్ చేశాడు. అందుకు అంగీకరించిన సయ్యద్ షాబాజ్.. ముందుగా ఈ సమాచారాన్ని ఏసీబీ అధికారులకు చేరవేశాడు. మంగళవారం సబ్ రిజిస్ట్రార్ తన అనుచరుడైన గోపిసింగ్ ద్వారా రూ. 2 లక్షలు తీసుకోగా.. ఏసీబీ అధికారులు వారిని వలపన్ని పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.