కురవి, వెలుగు: అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పనిచేసి మహాశివరాత్రి జాతరను విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతు రామచంద్రునాయక్ అన్నారు. మంగళవారం ఆయన కురవి వీరభద్రస్వామిని దర్శించుకున్నారు. అనంతరం మహాశివరాత్రి సందర్భంగా ఆలయ చైర్మన్ కొర్నీ రవీందర్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ నెల 15న జరిగే భద్రకాళి సమేత వీరభద్రస్వామి జాతర ఏర్పాట్లను అధికారులు సమన్వయంతో వారంరోజుల ముందుగానే పనులు పూర్తిచేయాలన్నారు.
అనంతరం జాతర పోస్టర్ ఆవిష్కరణ చేశారు. సమావేశంలో తహసీల్దార్ విజయ, ఎంపీడీవో వీరబాబు, ఆలయ ఈవో సత్యనారాయణ, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు అంబటి వీరభద్రం తదితరులు పాల్గొన్నారు. అనంతరం మరిపెడ అంగన్ వాడీ సూపర్ వైజర్ దైద ఉషారాణి అనారోగ్యానికి గురికాగా, ఆమెను పరామర్శించారు. కాంగ్రెస్ పార్టీలో దైద భద్రయ్య చేరడంతో కండువా
కప్పి ఆహ్వానించారు.
