మీరు పిచ్చోళ్లు కాదు.. పనిచేసినోళ్లకే ఓటెస్తరు!  :  ఎమ్మెల్యే రెడ్యానాయక్

మీరు పిచ్చోళ్లు కాదు.. పనిచేసినోళ్లకే ఓటెస్తరు!  :  ఎమ్మెల్యే రెడ్యానాయక్

నర్సింహులపేట, వెలుగు:  మీరు  పిచ్చోళ్లు కాదని, హంస లాంటి వారని, తప్పక పనిచేసినోళ్లకే ఓటు వేస్తారని జనాలనుద్దేశించి డోర్నకల్​ ఎమ్మెల్యే రెడ్యానాయక్​ కామెంట్స్​ చేశారు.  శనివారం మహబూబాబాద్ జిల్లాలోని నర్సింహులపేట మండలం వస్రాం తండా గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన మీటింగ్ లో ఆయన మాట్లాడారు.. ఎన్నికలు వస్తాయనగా  రెండు మూడు నెలల ముందు కాంగ్రెస్సోళ్లు ప్రజల దగ్గరకు వచ్చి లేనిపోని మాటలు చెప్తారన్నారు.   మనకేది చేయాలన్నా కేసీఆర్ మాత్రమే చేస్తారని, ఇన్ని  పనులు చేసిన ఆయనకు ఓటు వేయకపోవడానికి మీకు నీతి లేదా,  మీరు నిజాయితీపరులు  కారా.. ? అని  ప్రశ్నించారు.