ఐటీ ఉద్యోగులకు శుభవార్త.. డిసెంబర్ 31 వరకు వర్క్ ఫ్రమ్ హోమ్

ఐటీ ఉద్యోగులకు శుభవార్త.. డిసెంబర్ 31 వరకు వర్క్ ఫ్రమ్ హోమ్

దేశంలో కరోనా వైరస్ ఉధృతి కార‌ణంగా చాలా వ‌ర‌కు ఐటీ కంపెనీలు త‌మ ఉద్యోగుల‌ను ఇంటి నుంచే ప‌నిచేయ‌డానికే అనుమ‌తినిచ్చాయి. క‌రోనా వ్యాధి ప్ర‌బ‌ల‌కుండా కేంద్ర ప్ర‌భుత్వం కూడా మొదట ఏప్రిల్ 30 వరకు వర్క్‌ ఫ్రమ్ హోమ్ ప్రకటించింది. కోవిడ్ 19 వ్యాప్తి పెరగడంతో ఆ గ‌డువును జూలై 31 వరకు పొడిగించింది. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం మరోసారి ఐటీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది.

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఐటీ, బీపీవో కంపెనీలకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానాన్ని డిసెంబర్ 31 వరకు పొడిగించిన‌ట్టు ప్ర‌క‌టించింది. కోవిడ్‌-19 కారణంగా ప్రజల్లో నెలకొన్న భయాందోళనను దృష్టిలో ఉంచుకొని ఇంటి నుంచి పనిచేసే విధానాన్ని 2020 డిసెంబర్‌ 31 వరకు పొడిగిస్తూ… సర్వీసు ప్రొవైడర్లకు నిబంధనలు, షరతులలో డాట్‌ సడలింపులు ఇచ్చిందని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేష‌న్స్ ‌ ట్వీట్‌ చేసింది.

DoT relaxes work from home norms for IT-ITeS firms till December 31