భధ్రకాళి మాడవీధుల బాధితులకు డబుల్‍ బెడ్‍రూం ఇండ్లు

భధ్రకాళి మాడవీధుల బాధితులకు డబుల్‍ బెడ్‍రూం ఇండ్లు

వరంగల్‍, వెలుగు: భధ్రకాళి మాడవీధుల నిర్మాణంలో తాత్కాలిక ఇండ్లు వేసుకుని జీవిస్తున్న 17 మంది బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున డబుల్‍ బెడ్‍రూం ఇండ్లు కేటాయించారు. శనివారం హనుమకొండ కాకతీయ అర్బన్‍ డెవలప్మెంట్‍ అథారిటీ ఆఫీస్‍లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వరంగల్‍ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి, కుడా చైర్మన్‍ ఇనగాల వెంకట్రామ్​రెడ్డి, హనుమకొండ కలెక్టర్, కుడా వైస్‍ చైర్మన్​ చాహత్‍ బాజ్‍పాయ్‍ బాధితులకు లక్కీడ్రా పద్ధతిలో హనుమకొండ శాయంపేటలోని డబుల్‍ బెడ్‍రూం ఇండ్లను కేటాయించారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని, ఇనగాల వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ అభివృద్ధికి సహకరించిన బాధితులకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించామన్నారు. తద్వారా మాడవీధుల పనులను వేగవంతం చేయనున్నట్లు తెలిపారు.