
జనగాం జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్దిదారులు ఆందోళన నిర్వహించారు. ఇండ్లు పూర్తయినా కూడా ఇప్పటి వరకు పంపిణీ చేయకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు. దీంతో లబ్దిదారులే తాళాలు పగులకొట్టి ఇండ్లలోకి వెళ్లారు. ఏండ్ల క్రితం 2016లో మొదలయ్యాయి.
జనగాం జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో 2016లో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం ప్రారంభమైంది. రెండు మూడేళ్లలోనే ఇండ్లను పూర్తి చేశారు. అయినా కూడా లబ్దిదారులకు పంపిణీ చేయలేదు. పాలకుర్తి మండలంలోని అనేక గ్రామాల్లో పూర్తయిన డబుల్ బెడ్ రూం ఇండ్లు లబ్దిదారులకు పంపిణీ చేసినా..గూడురులో మాత్రం ఇవ్వలేదు. దీంతో అధికారులే పంపిణీ చేస్తారని ఎదురు చూసిన లబ్దిదారులు...ఏప్రిల్ 17వ తేదీన ఇండ్ల తాళాలు పగులకొట్టి ఇండ్లలోకి వెళ్లారు.