దసరాకి డబుల్ డెక్కర్.. మొదటగా తిప్పే రూట్లు ఇవే..

దసరాకి డబుల్ డెక్కర్.. మొదటగా తిప్పే రూట్లు ఇవే..

హైదరాబాద్, వెలుగు: సిటీలో డబుల్ డెక్కర్ బస్సులు వచ్చే దసరాకు రోడ్డెక్కనున్నాయి. ఇప్పటికే 25 బస్సులకు టెండర్‌‌ ప్రక్రియ పూర్తవగా శుక్రవారం ఓపెన్ చేయనున్నారు. బీఎస్ 6 రూల్స్​కు అనుగుణంగా నాన్ ఏసీ డబుల్ డెక్కర్ బస్సులను అందుబాటులోకి తెస్తామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. గత జనవరిలో ఆర్టీసీ టెండర్లు పిలిచింది. కానీ టెక్ని కల్ స్పెసిఫికేషన్ కోసం గడువును పెంచింది. దీంతో లేటైంది. అయితే బస్సులు మాన్యుఫాక్చర్, మోడిఫికేషన్‌‌కి టైమ్ పట్టేలా ఉండగా టెండర్లు వేసిన కంపెనీలు 150 రోజులు గడువు అడిగినట్లు అధికారులు చెప్పారు. డబులు డెక్కర్ బస్సులను తిప్పనున్న 5 రూట్లను కూడా గుర్తించారు.

టెండర్ల తర్వాత..

టెండర్ల ప్రక్రియ ముగి యగానే టెక్ని కల్ బిడ్డింగ్ లో పేర్కొన్నట్లు గా ముఖ్యమైన ఇంజిన్ విషయంలోనే జాప్యం జరిగే అవకాశం ఉంది. తొలి దశలో రానున్న 25 నాన్ ఏసీ బస్సులే కావడంతో తయారీకి సమయం పడుతుందని కంపెనీల ప్రతినిధులు ఆర్టీసీకి చెప్పారు. ఆర్టీసీ పేర్కొన్న ధరలు, స్పెసిఫికేషన్, చివరకు పర్చేజ్ ఆర్డర్ రావడానికి మరో రెండు నెలలు పట్టనుంది. పర్చేజ్ ఆర్డర్ ఇచ్చిన 5 నుంచి 6 నెలల వరకు తయారీ సాధ్యం కాదని తెలిసింది. అందుకే కంపెనీలు ముందస్తుగా అదనపు టైం కోరుతుండగా, ఎలాగైనా దసరా నాటికి పూర్తిస్థాయిలో బస్సులు రోడ్డెక్కించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఐదు రూట్లలో బస్సులు తిప్పనున్నట్టు చెబుతున్నారు. అయితే బస్సులు తయారైన తర్వాత ప్రాథమికంగా ఎంపిక చేసిన రూట్లను మార్చడానికి అవకాశం ఉందంటున్నారు.