
ఉస్తాద్ రామ్ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ ఎంటర్‌టైనర్ ‘డబుల్ ఇస్మార్ట్’. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’కు ఇది సీక్వెల్. ఇటీవల ‘స్టెప్పా మార్’ అనే మాస్ ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేసిన మేకర్స్..మంగళవారం జూలై 16న సెకండ్ సాంగ్ ‘మార్ ముంత చోడ్ చింత’ అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు.
ప్రస్తుతం ఈ పాటలోని దేసి లిరిక్స్ కు సినీ లవర్స్ అండ్ రామ్ ఫ్యాన్స్ మస్త్ హుషార్ తో చిందేస్తున్నారు. అలాగే, ఈ పాటలోని లిరిక్స్ కి ఓ వైపు అంతే జోరుగా మాజీ ముఖ్యమంత్రిని అవమానపరిచారంటూ విమర్శలు వస్తున్నాయి. అసలు మాజీ ముఖ్యమంత్రిని కించపరిచే లిరిక్స్ ఏం ఉన్నాయో..వివాదం ఎందుకు తలెత్తుందో చూద్దాం.
‘డబుల్ ఇస్మార్ట్ లోని ఈ సెకండ్ లిరికల్ మార్ ముంత చోడ్ చింత పాట ఇప్పుడు కాంట్రవర్సీకి తెరలేపింది. అయితే, ఈ పాట మధ్యలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వాయిస్ ఉపయోగించారు మేకర్స్. అంతేకాదు..పాట మధ్యలో కేసీఆర్ మాట్లాడిన పాపులర్ డైలాగ్స్‌లలో ఒకటైన "ఏం జేద్దామంటవ్ మరీ" పదాన్ని డైరెక్ట్ తన వాయిస్ తోనే వాడారు. దీంతో కేసీఆర్ అభిమానులు, బిఆర్ఎస్ నాయకులు డైరెక్టర్ పూరీ ఇంటిని ముట్టడిస్తామని వార్నింగ్ ఇస్తున్నారు.అలాగే ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాను తెలంగాణాలో రిలీజ్ కాకుండా ఆపుతామంటూ హెచ్చరిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ ను అవమానించే విధంగా ఆయన మాటలను ఒక ఐటెం సాంగ్ లాంటి పాటలో ఎలా పెడతారు అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు తెలంగాణ అంటే తాగుడూ సంస్కృతిగా చూపించేలా ఈ పాట ఉందంటూ గట్టిగానే విమర్శిస్తున్నారు. అసలు పాటలో కేసీఆర్ హుక్ లైన్ వాడటంలో ఉన్న ఉద్దేశం ఏంటో చెప్పాలని డైరెక్టర్ ని డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ విషయం మీద పూరి జగన్నాథ్ అండ్ టీం ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాల్సి ఉంది.