ఆ సీన్స్​ కోసం డబుల్​ రెమ్యూనరేషన్!​

ఆ సీన్స్​ కోసం డబుల్​ రెమ్యూనరేషన్!​

మిల్కీ బ్యూటీ తమన్నా(Tamannaah)  అందాల ఆరబోతతో  సౌత్​లోనూ ‘లస్ట్​ స్టోరీస్​ 2’ (Lust Stories2) కి మంచి క్రేజ్​ ఏర్పడింది. అయితే, ఊహించిన రేంజ్​​లో ఈ సిరీస్​  ఆకట్టుకోలేకపోయింది. ఇక ప్రియుడు విజయ్​ వర్మతో చేసిన రొమాంటిక్​ సీన్లు మాత్రం తమన్నాకు ఫ్రీ పబ్లిసిటీని తెచ్చిపెట్టాయి. ఎన్నడూ లేని విధంగా ముద్దు సీన్లకు సైతం ఈ ముద్దుగుమ్మ ఎస్​ చెప్పింది. 

ఇందుకోసం ఆమెకు రూ. 7 కోట్ల రెమ్యూనరేషన్​ ఇచ్చారట. మొదట ఈ సిరీస్​కు తమన్నా ఒప్పుకోలేదట.  దీంతో రూ. 4 కోట్ల లోపే ఉన్న ఆమె రెమ్యూనరేషన్​ రేంజ్​ను డబుల్​ చేశారని టాక్​ నడుస్తోంది. ఈ సిరీస్​లో 30 నిమిషాల పాటు సాగే ఈ బోల్డ్​ సీన్లు హాట్​ టాపిక్​గా మారిన విషయం తెలిసిందే. 

ఈ క్రేజ్​తో ప్రస్తుతం బాలీవుడ్​లో ఈ బ్యూటీ బిజీగా మారింది. సౌత్​లో జైలర్​, భోళాశంకర్​ సినిమాల్లో నటిస్తోంది.