వాషింగ్టన్: మితిమీరిన అప్పులతో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకున్న శ్రీలంక లాంటి పరిస్థితినే మరో 12 దేశాలు ఎదుర్కొంటున్నాయి. ఆ దేశాల ఆర్థిక వ్యవస్థ డేంజర్ జోన్లో ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజురోజుకు పెరుగుతున్న అప్పులు, ద్రవ్యోల్బణంతో ఆ దేశాల ఎకానమీ పతనమయ్యే అవకాశం ఉందని వారు ఆందోళన చేస్తున్నారు. శ్రీలంక, లెబనాన్, రష్యా, సురినామ్, జాంబియా ఇప్పటికే డిఫాల్ట్లోకి (అప్పు లేదా అప్పుపై వడ్డీ చెల్లించలేని పరిస్థితి) వెళ్లిపోయాయని చెప్పారు. ఆ దేశాల బాటలోనే అర్జెంటీనా, ఉక్రెయిన్, ట్యునీషియా, ఘనా, ఈజిప్ట్, కెన్యా, ఇథియోపియా, ఎల్‌సాల్వడార్, పాకిస్తాన్, బెలారస్, ఈక్వెడార్, నైజీరియా దేశాలు పయనిస్తున్నాయని వెల్లడించారు. ఆ 12 దేశాల్లో రోజువారి ఖర్చులు భారీగా పెరుగుతున్నాయని, పరిస్థితి దయనీయంగా ఉందని అన్నారు. ‘‘ఆ 12దేశాల్లో 150 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.12 లక్షల కోట్లు) అప్పుతో అర్జెంటీనా ఫస్ట్‌ప్లేస్‌లో ఉంది. రూ.3 లక్షల కోట్లతో ఈక్వెడార్రెండో స్థానంలో, రూ.4 లక్షల కోట్లతో ఈజిప్ట్ మూడో స్థానంలో ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు రికవర్అయితే ఇంటర్నేషనల్ మోనటరీ ఫండ్ మద్దతుతో కొద్దిరోజులు అప్పులు చెల్లించకుండా ఆ దేశాలు తప్పించుకోవచ్చు” అని ఎక్స్పర్ట్స్పేర్కొన్నారు.
అర్జెంటీనా
డిఫాల్ట్లో అర్జెంటీనాది వరల్డ్ రికార్డు. ఈ దేశ కరెన్సీ పెసో బ్లాక్ మార్కెట్లో 50 డిస్కౌంట్‌తో ట్రేడ్అవుతోంది. దేశ రిజర్వులు ఆందోళనకర స్థాయిలో ఉన్నాయి. 2024 దాకా అప్పులు తీర్చే పరిస్థితి లేదు. రుణాల కోసం ఐఎంఎఫ్‌పై ఆధారపడవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
ఉక్రెయిన్
రష్యా దురాక్రమణతో ఉక్రెయిన్ పరిస్థితి దారుణంగా మారింది. ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించాలంటే దాదాపు రూ.16 లక్షల కోట్ల అప్పును సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఇంకా రూ.960 కోట్ల బాండ్ల చెల్లింపులు చేయాల్సి ఉంది.
ట్యునీషియా
ట్యునీషియా డేంజర్‌జోన్‌లో ఉంది. బడ్జెట్లో 10% లోటు ఉంది. ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. ప్రెసిడెంట్ కైస్ సయిద్ తన అధికారం నిలుపుకోవడంపైనే శ్రద్ధ చూపుతుండ డంతో అప్పు ఇచ్చేందుకు ఐఎంఎఫ్ ముందుకు రాకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఘనా
అదేపనిగా అప్పులు తీసుకోవడంతో డెబ్ట్ టు జీడీపీ రేషియో(దేశ ప్రభుత్వ అప్పు, దాని జీడీపీ మధ్య ఉన్న నిష్పత్తి) 85%కి చేరింది. కరెన్సీ సెడి తన విలువలో 25% కోల్పోయింది. వడ్డీలు చెల్లించడానికే సగం రెవెన్యూ ఖర్చు చేస్తోంది. ఇన్ఫ్లేషన్ 30శాతానికి దగ్గరలో ఉంది.
ఈజిప్ట్
ఈజిప్ట్ డెబ్ట్ టు జీడీపీ రేషియో 95 % ఉంది. వచ్చే ఐదేళ్లలో అప్పు 100 మిలియన్డాలర్లు (రూ.8 లక్షల కోట్లు) కావచ్చని ఎఫ్ఐఎం పార్ట్నర్స్ అంచనా. ఈజిప్షియన్ పౌండ్ విలువను ప్రభుత్వం 15% తగ్గించింది. మరిన్ని అప్పుల కోసం ఐఎంఎఫ్‌ను అడిగింది.
కెన్యా
వడ్డీ చెల్లింపుల మీదే తన రెవెన్యూలో కెన్యా 30% ఖర్చు చేస్తోంది. ఈ దేశ బాండ్లు సగం విలువను కోల్పోయాయి. క్యాపిటల్ మార్కెట్లో కూడా కరెన్సీకి చోటులేని పరిస్థితి నెలకొంది. కెన్యా అప్పు మరింత ప్రమాదకర స్థాయిలో పెరగవచ్చని మూడీ సంస్థ పేర్కొంది.
పాకిస్తాన్
దిగుమతులు బాగా పెరిగిపోవడంతో అప్పులు చెల్లించలేని స్థితికి చేరు కుంది. విదేశీ మారక నిల్వలు రూ.78 వేల కోట్లకు తగ్గినయి. రూపాయి విలువ పడిపోయింది. రెవెన్యూలో 40% అప్పుల చెల్లింపుల కోసమే పాక్ ఖర్చు చేస్తోంది.
ఇథియోపియా: సివిల్ వార్ కారణంగా దేశంలో అభివృద్ధి కుంటుపడింది.
బెలారస్: ఉక్రెయిన్‌పై యుద్ధం విషయంలో రష్యాకు సపోర్టు చేయడంతో ఆర్థికంగా కుంగిపోయింది.
ఈక్వెడార్: రెండేళ్ల కిందటే ఈ లాటిన్ అమెరికా దేశం డిఫాల్ట్లోకి వెళ్లిపోయింది.
నైజీరియా: అప్పులు చెల్లించడంపైనే ఈ దేశం తన రెవెన్యూలో 30 ఖర్చు చేస్తోంది.
ఎల్‌సాల్వడార్ కూడా ఆర్థిక పరిస్థితి కూడా సంక్షోభానికి దగ్గర్లో ఉంది.
