ఆగ్రా హైవే పొగ మంచు.. కార్లపైకి ఎక్కిన కార్లు

ఆగ్రా హైవే పొగ మంచు.. కార్లపైకి ఎక్కిన కార్లు

దేశవ్యాప్తంగా చలి తీవ్రంగా ఉంది.. ఇదే సమయంలో అర్థరాత్రి నుంచి ఉదయం వరకు పొగ మంచు దట్టంగా పడుతుంది. ఈ క్రమంలోనే జాతీయ రహదారులపై యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయి. పొగ మంచు కారణంగా ముందు వెళుతున్న వాహనాలు కనిపించకపోవటం.. వేగంగా వెళ్లటం.. వాహనాలపై డ్రైవర్లకు కంట్రోల్ తప్పటం వంటి కారణాలతో ప్రమాదాలు జరుగుతున్నాయి. డిసెంబర్ 27వ తేదీ తెల్లవారుజామున యూపీలోని ఆగ్రా, లక్నో హైవే గందరగోళంగా మారింది. 

పొగ మంచు కారణంగా ముందు వెళుతున్న వాహనాలు కనిపించక పదుల సంఖ్యలో యాక్సిడెంట్లు జరిగాయి. ఉన్నావ్ సమీపంలో పొగ మంచు కారణంగా ఓ బస్సు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది.. ఆ వెంటనే వెనక వస్తున్న కార్లు, ట్రక్కులు ఒకదాని వెంట ఒకటి ఆ బస్సును ఢీకొన్నాయి. ఈ క్రమంలోనే ఓ కారు అతి వేగంగా వచ్చి.. ముందు యాక్సిడెంట్ అయిన కారును ఢీకొట్టి.. దానిపైన పడింది. డబుల్ డెక్కర్ బస్సు తరహాలో.. కారుపై కారు ఉండటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

పది నుంచి 12 వాహనాలు ఒకదానికొకటి ఢీకొనటంతో.. ఒకరు చనిపోయారు. 24 మంది గాయపడ్డారు. యాక్సిడెంట్ అయిన వాహనాలకు పార్కింగ్ లైట్లు కూడా పని చేయకపోవటంతో.. వెనక వస్తున్న వాహనాలు.. యాక్సిడెంట్ స్పాట్ వరకు వచ్చే వరకు గమనించలేక ఢీకొంటున్నారు.