పొలిటికల్ ర్యాలీపై ఎటాక్ .. 29 మంది మృతి

పొలిటికల్ ర్యాలీపై ఎటాక్ .. 29 మంది మృతి

కాబూల్ఆఫ్గానిస్తాన్‌లో  పొలిటికల్ ర్యాలీపై దుండగులు ఎటాక్ చేశారు. కాబూల్‌లో షియా లీడర్ అబ్దుల్ అజర్ అలీ స్మారకార్థం శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని టార్గెట్ చేస్తూ కాల్పులు, బాంబు దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో 29 మంది చనిపోయారు. 30 మందికి పైగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది పిల్లలు, మహిళలేనని అఫ్గాన్ ఇంటీరియర్ మినిస్ట్రీ అధికారులు తెలిపారు. రాజధాని సెంటర్‌లో దుండగులు చేసిన దాడితో ఇక్కడ  సెక్యూరిటీ వైఫల్యం బయటపడింది. హై ఫ్రొఫైల్ పొలిటికల్ లీడర్లు అంతా ప్రదర్శనలో పాల్గొన్నారు. అఫ్గాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడిన అబ్దుల్లా కూడా దాడి జరిగిన సమయంలో అక్కడే ఉన్నారు.అదృష్టవశాత్తు వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.  సెక్యూరిటీ బలగాలు వారిని వెంటనే సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లాయి. అఫ్గాన్‌లో యూఎస్ బలగాలను ఉపసంహరించుకునేందుకు వారం రోజుల క్రితమే ఒప్పందం కుదిరింది.

ఈ ఒప్పందం ప్రకారం 14 నెలల లోపు యూఎస్ బలగాలు ఇక్కడ నుంచి ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఒప్పందం కుదిరిన వారం రోజుల్లో ఇంత పెద్ద ఎటాక్ జరగటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కావాలనే పక్కా ప్లాన్ ప్రకారం ఈ దాడిని ఎవరో చేయించారని అఫ్గాన్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని తాలిబన్లు ప్రకటించారు. దీంతో ఎటాక్ చేసిందెవరన్నది మిస్టరీగా మారింది. సెక్యూరిటీ  బలగాలు సంఘటనపై ఎంక్వైరీ చేస్తున్నాయి. అఫ్గాన్  ప్రెసిడెంట్ అష్రాఫ్ ఘనీ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఇది మానవత్వంపై జరిగిన ఎటాక్ అని అన్నారు.  గతేడాది ఇక్కడే ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్ట్‌ లు దాడి చేసి 11 మందిని చంపేశారు. ప్రస్తుతం జరిగిన దాడి కూడా వారి పనేనని అంచనా వేస్తున్నారు.