- ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్ణారెడ్డి
ముషీరాబాద్,వెలుగు: ప్రపంచ సాంకేతిక విద్య (టెక్నికల్ ఎడ్యుకేషన్)ను మహిళలు అందుపుచ్చుకోవాలని, అన్ని రంగాల్లో రాణిస్తూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ డాక్టర్ వి.బాలకిష్టారెడ్డి పిలుపునిచ్చారు. విద్యానగర్లోని వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ‘స్ట్రాటజీస్ అండ్ చాలెంజెస్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఇన్ ఇండియా’ అనే అంశంపై జరిగిన రెండ్రోజుల జాతీయ సదస్సు ముగింపులో గురువారం ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు.
మహిళలు ఆర్థికంగా సాధికారత సాధించాలంటే నాణ్యమైన విద్య, నైపుణ్య శిక్షణ తప్పనిసరన్నారు. మహిళల హక్కులను గౌరవిస్తూ అన్ని రంగాల్లో వారిని ప్రోత్సహించినప్పుడే నిజమైన సాధికారత సాధ్యమవుతుందని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డా. కె. ప్రభు, రిటైర్డ్ ప్రొఫెసర్ నాయుడు అశోక్, సదస్సు కన్వీనర్ డా. ఎస్. రమాదేవి, ఆర్. లావణ్య, తిరుపతి అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
