మంత్రి హరీష్ రావుతో నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప భేటీ

మంత్రి హరీష్ రావుతో నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప భేటీ

హైదరాబాద్ : నూతనంగా నిమ్స్ డైరెక్టర్ గా నియమితులైన డాక్టర్ బీరప్ప శనివారం (జూన్ 10న) ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు నిమ్స్ డైరెక్టర్ గా అవకాశం కల్పించడం పట్ల సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఎంతో నమ్మకంతో ప్రతిష్టాత్మకమైన నిమ్స్ కు డైరెక్టర్ గా అవకాశం కల్పించారన్నారని, వారి నమ్మకం నిలబెట్టెలా కృషి చేస్తానని డాక్టర్ బీరప్ప చెప్పారు.

అన్ని విభాగాల సిబ్బంది సమన్వయంతో ప్రజలకు మంచి వైద్య సేవలు అందిస్తామని డాక్టర్ బీరప్ప చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు డైరెక్టర్ బీరప్పకు శుభాకాంక్షలు తెలిపారు. ఆరోగ్య తెలంగాణ కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ ఆశయం మేరకు పని చేసి, నిమ్స్ ప్రతిష్టను మరింత పెంచేలా కృషి చేయాలని మంత్రి హరీష్ రావు సూచించారు. నిమ్స్ దేశంలోనే అత్యుత్తమ సేవలు అందించే ఆస్పత్రిగా అగ్రస్థానంలో నిలవాలని ఆకాంక్షించారు.