_FxXdZsbz0L.jpg)
హైదరాబాద్: అంతర్జాతీయ విత్తన పరీక్ష సంఘం (ISTA) అధ్యక్షుడిగా డా.కె.కేశవులు నియమితులయ్యారు. ఈజిప్ట్ రాజధాని కైరోలో జరుగుతున్న ఇస్టా అంతర్జాతీయ కాంగ్రెస్‌లో ఆయన పేరును అధికారికంగా ప్రకటించారు. ఇస్టా అధ్యక్షుడిగా ఆసియా నుంచి ఎంపికైన తొలి వ్యక్తిగా డా.కేశవులు రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా ప్రగతి భవన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో డా.కేశవులును సీఎం కేసీఆర్ అభినందించారు. కేశవులు నియామకం అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు దక్కిన గౌరవంగా సీఎం కేసీఆర్ అభివర్ణించారు. రాష్ట్రాన్ని ప్రపంచ విత్తన భాండాగారంగా ఐక్యరాజ్య సమితి గుర్తించిన విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు.
ఆసియా ఖండంలోనే తొలిసారిగా అంతర్జాతీయ విత్తన పరీక్ష సంఘం (ISTA) అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా తెలంగాణ విత్తన సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ డా. కె. కేశవులును ప్రగతి భవన్ లో ఈ రోజు సీఎం శ్రీ కేసీఆర్ అభినందించారు. pic.twitter.com/lg7ZapLIyK
— Telangana CMO (@TelanganaCMO) May 18, 2022
2019లో హైదరాబాద్‌లో జరిగిన ఇస్టా అంతర్జాతీయ కాంగ్రెస్‌లో ఆయన ఉపాధ్యక్షుడిగా ఎంపికైన సంగతి విదితమే. అధిక దిగుబడులు సాధించడానికి, మెరుగైన విత్తనాలు అందేందుకు నాణ్యత పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్ అందించడ మే ఇస్టా లక్ష్యం. ల్యాబ్‌లో విత్తనాల నాణ్యతను గుర్తించి అవి సరైన ప్రమాణాలతో ఉన్నాయని తేలితేనే ఇస్టా సర్టిఫికేషన్ ఇస్తారు. డా.కేశవులు ప్రస్తుతం రాష్ట్ర విత్తన సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు.
మరిన్ని వార్తల కోసం...