హైదరాబాద్, వెలుగు: డైరెక్టర్ ఆఫ్మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ)లో కీలక నియామకం చేపడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ ఎం. రమాదేవికి పదోన్నతి కల్పిస్తూ, ఆమెను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌గా (అకడమిక్) నియమిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జెడ్ చోంగ్తూ శనివారం జీవో జారీ చేశారు.
తెలంగాణ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్-1996 ప్రకారం సీనియారిటీ ఆధారంగా ఈ ప్రమోషన్ కల్పించినట్టు ప్రభుత్వం పేర్కొంది. అయితే, ఈ నియామకం తాత్కాలికమేనని, కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న వివిధ కేసుల తుది తీర్పులకు లోబడి ఈ ప్రమోషన్ ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆమెను తక్షణమే కొత్త బాధ్యతల్లో చేరాలని ఆదేశించింది
