జేవీఆర్ కాలేజ్ లెక్చరర్ కు డాక్టరేట్

జేవీఆర్ కాలేజ్  లెక్చరర్ కు డాక్టరేట్

సత్తుపల్లి, వెలుగు: జేవీఆర్‌‌ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కెమిస్ట్రీ లెక్చరర్ మతకాల బాలకృష్ణ మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. ఉస్మానియా యూనిర్సిటీ ప్రొఫెసర్ హరి పద్మశ్రీ నేతృత్వంలో హెట్రోజినియస్ కాటలిస్ట్ బయో ఫ్యూయల్ తయారు చేసే విధానంలో గ్లిసరాల్ అనే వ్యర్థం నుంచి సల్కేటోల్ రసాయనాన్ని  కిటోసిస్ అనే చర్య ద్వారా పొందవచ్చు అని నిరూపించారు. ఈ పరిశోధనకు గాను యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసినట్లు బాలకృష్ణ తెలిపారు.  దీంతో కళాశాల ప్రిన్సిపల్, లెక్చరర్లు ఆయన్ని అభినందించారు.