- నియామక పత్రం అందజేసిన స్టేట్ చైర్మన్ డాక్టర్ రాజీవ్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) డాక్టర్స్ సెల్, మెడికల్ అండ్ హెల్త్ వింగ్ స్టేట్ జనరల్ సెక్రటరీగా డాక్టర్ రామగిరి రాజేందర్ నియమితులయ్యారు. ఆదివారం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో డాక్టర్స్ సెల్ స్టేట్ చైర్మన్ డాక్టర్ ఎం.రాజీవ్ చేతుల మీదుగా రాజేందర్ తన అపాయింట్ మెంట్ ఆర్డర్ అందుకున్నారు.
ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడారు. తనపై నమ్మకం ఉంచి ఇంత పెద్ద బాధ్యతను అప్పగించిన చైర్మన్ డాక్టర్ రాజీవ్, పీసీసీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డాక్టర్లు, హెల్త్ వర్కర్లను ఏకతాటిపైకి తెస్తానని చెప్పారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చూడటమే తన లక్ష్యమని పేర్కొన్నారు.
