గుండె మందు రేటు తగ్గించిన డా.రెడ్డీస్‌‌

గుండె మందు రేటు తగ్గించిన డా.రెడ్డీస్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: గుండె వ్యాధుల ట్రీట్‌‌మెంట్‌‌లో వాడే మందు సిడ్మస్‌‌ ధరలను  డా.రెడ్డీస్ తగ్గించింది. హార్ట్‌‌ ఫెయిల్యూర్ అయిన పేషెంట్లకు ఈ మందును సిఫార్స్ చేస్తారు. ప్రస్తుతం సిడ్మస్ ట్యాబ్లెట్లు  50 ఎంజీ, 100 ఎంజీ, 200 ఎంజీ  సామర్ధ్యంలో  అందుబాటులో ఉన్నాయి.  సాధారణంగా రోజుకి 2 ట్యాబ్లెట్లను పేషెంట్లకు డాక్టర్లు రికమండ్ చేస్తున్నారు.  రేట్లను తగ్గించిన తర్వాత సిడ్మస్ 50 ఎంజీ ట్యాబ్లెట్ ధర రూ.29 గా ఉంది. గతంలో దీని రేటు రూ.78.32.  100 ఎంజీ ట్యాబ్లెట్ ధర రూ. 83.86 నుంచి రూ. 49 కి, 200 ఎంజీ ట్యాబ్లెట్ ధర రూ.96.71 నుంచి రూ. 79 కి దిగొచ్చాయి. 

మరిన్ని వార్తలు